HomeTelugu Trending'ఫిల్మ్‌ ఫేర్‌'కి నామినేట్‌ అయిన 'జాతీయ రహదారి' మూవీ

‘ఫిల్మ్‌ ఫేర్‌’కి నామినేట్‌ అయిన ‘జాతీయ రహదారి’ మూవీ

Jathiya rahadari movie nomi
‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’, ‘లజ్జ’ సినిమాల డైరెక్టర్‌ నరసింహనంది దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘జాతీయ రహదారి’. మధుచిట్టి, సైగల్‌ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్‌ దక్షిత్‌ రెడ్డి, అభి, శ్రీనివాస్‌ పసునూరి నటించిన ఈ సినిమాని భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్‌కు నామినేట్‌ అయింది. ఈ సందర్భంగా నిర్మాత అంబికా కృష్ణ ‘జాతీయ రహదారి’ చిత్ర దర్శక, నిర్మాతలకు అభినందనలు తెలిపారు. అనంతరం అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ‘‘రామ సత్యనారాయణ ధైర్యంగా వంద సినిమాలు పూర్తి చేసుకొని, 101వ సినిమా ‘జాతీయ రహదారి’ తో ముందుకు వస్తుండటం అభినందించాల్సిన విషయం.

ఈ సినిమాకి నరసింహ నంది లాంటి డైరెక్టర్‌ను సెలెక్ట్‌ చేసుకోవడం చాలా గొప్ప విషయం. తెలుగు చిత్రసీమలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. తమిళంలో సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా, మలయాళంలో తీసిన ‘జల్లికట్టు’ సినిమాలు ఆస్కార్‌ నామినేషన్‌కి వెళ్లాయి. మన తెలుగు సినిమాలు కూడా ఆ స్థాయికి వెళ్లేలా మన నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు అడుగులు వేయాలి’’ అన్నారు. కాగా నరసింహనంది దర్శకత్వం వహించిన ‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’, ‘లజ్జ’ సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu