HomeTelugu Newsనా ఫిలింఫేర్‌ అవార్డును సీఎంఆర్‌ఎఫ్‌ కు ఇచ్చేస్తున్నా

నా ఫిలింఫేర్‌ అవార్డును సీఎంఆర్‌ఎఫ్‌ కు ఇచ్చేస్తున్నా

శనివారం జరిగిన ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమంలో ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు గానూ ‘విజయ్‌ దేవరకొండ’ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. కానీ ఈ అవార్డును ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చేస్తాన్న అంటూన్నారు విజయ్‌. అవార్డు అందుకున్న సందర్భంగా తన అభిప్రాయాలను ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ తరువాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ తనకంటూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.

2 18

‘ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అందుకున్నాను. కానీ నాకు నచ్చిన రంగాన్ని ఎంచుకున్నప్పుడే నేను గెలిచేశాను. ఆ తర్వాత ఇండస్ట్రీ నాకు గౌరవం, డబ్బు ఇచ్చినప్పుడు మరోసారి గెలిచినట్లు అనిపించింది. అమ్మానాన్నలకు సొంతిల్లు కొన్నప్పుడు గెలిచినట్లు అనిపించింది. అభిమానులు నాపై ప్రేమ, అభిమానం కురిపించినప్పుడు మళ్లీ గెలిచినట్లు అనిపిస్తోంది. ఈ అవార్డు ఒక బోనస్‌. కానీ ఈ అవార్డును సీఎంఆర్‌ఎఫ్‌కు ఇచ్చేద్దామనుకుంటున్నాను. వాళ్లు ఇందుకు ఒప్పుకుంటే రేపే వెళ్లి ఇచ్చేస్తాను. ఈ అవార్డు నా ఇంట్లో ఉండటం కంటే నేను పుట్టిన ఈ నగరానికి ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ ట్విటర్‌లో చూస్తుంటా.. ఎంతో మంది సాయం చేయమని అడిగితే కేటీఆర్‌ అన్న సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా వెంటనే సాయం చేస్తారు. నేను అందుకున్న తొలి అవార్డును వేలం వేస్తే దాని ద్వారా వచ్చే డబ్బు ఇతరులకు సాయం చేయడానికి ఉపయోగపడుతుంది. అప్పుడే నేను అందుకున్న ఈ తొలి అవార్డుకు విలువ ఉంటుంది. ఇది ఎలా జరుగుతుందో తెలీదు కానీ నాకు అనిపించింది కమిట్‌ అయిపోయా. దీనిని విజయవంతం చేయడానికి ఇది తొలి అడుగు. లెట్స్‌ డూ దిజ్‌’ అని పేర్కొన్నారు విజయ్‌. ప్రస్తుతం విజయ్‌ ‘ట్యాక్సీవాలా’ చిత్ర ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఆయన నోటా’ చిత్రంలోనూ నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu