చారి తరహా పాత్రలో బన్నీ!

అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ అనే సినిమాలో
నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణుడిగా కనిపించబోతున్నట్లు టాక్. గతంలో
ఎన్టీఆర్ ‘అదుర్స్’ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమాలో చారి పాత్రలో ఎన్టీఆర్ తన నటనతో
ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు బన్నీ కూడా సరిగ్గా అదే తరహా పాత్రలో కనిపించబోతున్నాడు.
క్లాస్, మాస్ చిత్రాల్లో నటించే బన్నీ ఇటువంటి పాత్రలో నటించగలడా..? అనే అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి. కానీ బన్నీ మాత్రం ఎంతో పట్టుదలతో ఈ సినిమా అంగీకరించాడు. తను
ఏ పాత్రలో అయినా.. నటించగలనని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ పాత్ర కోసం
బన్నీ హోమ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే లింగుస్వామి, విక్రమ్ కుమార్
లను కూడా పక్కన పెట్టేశాడు బన్నీ. మరి ఈ సినిమాతో బన్నీ ఎలాంటి పేరు తెచ్చుకుంటాడో..
చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates