HomeTelugu Trendingజయసుధ న్యూలుక్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌

జయసుధ న్యూలుక్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌

jayasudha new photo viral

‘సహజనటి’జయసుధ.. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘మహర్షి’, బాలకృష్ణ ‘రూలర్‌’ తర్వాత జయసుధ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఈ మధ్య ఆమె ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారు. కొంతకాలంగా ఆమె ఆరోగ్యం బాగుండటం లేదని, అనారోగ్యం కారణంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై కచ్చితమైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ ఫొటో చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. నిండు మొహంతో కాస్తా లావుగా ఉండే జయసుధ, ఈ ఫొటోలో పీక్కుపోయి కనిపించారు. అంతేకాదు చాలా డిఫరెంట్‌గా కూడా ఉన్నారు. తన ట్విటర్‌లో ఫొటో షేర్‌ చేస్తూ.. ‘స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ’ అంటూ జయసుధ ట్వీట్‌ చేసింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెను చూసి షాకవుతున్నారు.

jayasudha 1

ఇదేంటి ఇలా మారిపోయారు, ముఖంలో మునుపటి కళ లేదు. సహజనటికి నిజంగా ఆనారోగ్య సమస్యలు తలెత్తినంటున్నాయంటూ అంటూ ఆమె ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. అయితే ఆమెకు ఏమైంది, విదేశాలకు ఎందుకు వెళ్లారనేది స్వయంగా ఆమె స్పందించే వరకు వేచి చూడాలి. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. పెద్ద కుమారుడు నిహార్ వివాహం గతేడాది వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఆమె స్పందించే వరకు వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu