HomeTelugu Trendingజయసుధ లుక్‌.. ఆందోళనలో ఫ్యాన్స్‌

జయసుధ లుక్‌.. ఆందోళనలో ఫ్యాన్స్‌

Jayasudha Latest Look viral
సహజనటి జయసుధ పద్నాగేళ్ల క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తుంది. తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వీడియోతో నెటిజన్ల ముందుకు వచ్చింది. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం కానున్న సీరియల్‌ ‘జానకి కలగనలేదు’ బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ సందేశం విడుదల చేశారు. జయసుధ, శోభన్‌బాబు కలిసి నటించిన ‘జానకి కలగనలేదు.. రాముడి సతి కాగలనని ఏనాడు’ పాట అప్పట్లో ప్రభంజనం సృష్టించిన విషయాన్ని జయసుధ గుర్తుచేసుకున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను అన్నిచోట్లా మారుమోగిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ హిట్‌ సాంగ్‌ను ఊటీలో షూట్‌ చేశామని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఆ పాట పేరుతో సీరియల్‌ రావడం సంతోషంగా ఉందని, ధారావాహిక పెద్ద హిట్‌ కావాలని ఆకాంక్షించారు. చాలా రోజుల తర్వాత జయసుధను చూడటంతో ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియోలో ఆమె లుక్‌ అభిమానులను ఆందోళలకు గురిచేస్తుంది. ఆరెంజ్‌ కలర్‌ నెక్‌ టీషర్ట్‌ ధరించిన జయసుధ నెరిసిన జుట్టుతో కనిపించారు. ముఖంలో మునుపటి కళ లేదు. పూర్తిగా పాలిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ లుక్‌ వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu