తిత్లీ వరద బాధితులకు జీవిత రాజశేఖర్ సహాయం!

తిత్లీ వరద బాదితులను ఆదుకునేందుకు తెలుగు సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, వరుణ్ తేజ్, నిఖిల్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ వంటి హీరోలంతా తన వంతు సహాయం అందించగా సీనియర్ హీరో రాజశేఖర్ కూడ తన సతీమణి జీవితతో కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి 10 లక్షల సహాయాన్ని అందించారు. ఉండవల్లిలో క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రిని కలిసి చెక్ అందజేశారు. వీరితో పాటే ఎంఎస్ విశాఖ ఫిలిం నగర్ సెంటర్ ప్రతినిధులు తమ వంతుగా 5 లక్షల సహాయాన్ని ముఖ్యమంత్రికి అందించారు.