హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ‘పిట్టగోడ’!

విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్‌ పతాకాలపై అనుదీప్‌ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘పిట్టగోడ’. ఈ చిత్రంలోని ఫోర్త్‌ సాంగ్‌ను డిసెంబర్‌ 15న హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో డి.సురేష్‌బాబు లాంచ్‌ చేశారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా..
డి.సురేష్‌బాబు మాట్లాడుతూ.. ”కొత్తవాళ్లందర్నీ ఎంకరేజ్‌ చేస్తూ ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసారు రామ్మోహన్‌. మళ్లీ ‘పిట్టగోడ’ చిత్రంతో చాలామందిని పరిచయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎక్స్‌లెంట్‌గా నటించారు. సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాని డిసెంబర్‌ 24న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. గోదావరిఖని వంటి రియల్‌ లొకేషన్స్‌లో ఈ సినిమా చేశారు” అన్నారు.
నిర్మాత రామ్మోహన్‌ పి. మాట్లాడుతూ.. ” నాయుడుగారు, సురేష్‌బాబుగారు కొత్తవాళ్లని ఎంకరేజ్‌ చేసి ఎన్నో సినిమాలను నిర్మించారు. వారి ఇనిస్పిరేషన్‌తోనే కొత్తవాళ్లను ఎంకరేజ్‌ చేస్తూ సినిమాలు చేస్తున్నాను” అన్నారు.
దర్శకుడు అనుదీప్‌ మాట్లాడుతూ.. ”మా టౌన్‌లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్‌ బేస్‌ చేసుకుని ఈ కథ రెడీ చేసాను. రియలిస్టిక్‌ అప్రోచ్‌తో సాగే కథ ఇది. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిల్మ్‌. సురేష్‌బాబుగారు, రామ్మోహన్‌గారు కథ విని బాగా ఇంప్రెస్‌ అయ్యారు. ప్రతి ఒక్కరికీ వాళ్ల లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్స్‌ గుర్తుకు వస్తాయి. కమలాకర్‌గారు పాటలతో, రీ-రికార్డింగ్‌తో సినిమాని నెక్స్‌ట్‌ లెవెల్‌కి తీసుకెళ్ళారు” అన్నారు.