ఆయన నా లవ్‌ ప్రపోజల్‌ను తిరస్కరించారు: షకీలా

ప్రముఖ నటి షకీలా ఓ నిర్మాతకు లవ్‌ లెటర్‌ రాశారట. కానీ, ఆమె ప్రపోజల్‌ను సదరు నిర్మాత తిరస్కరించారంటూ బాధపడుతున్నారు. షకీలా జీవితాధారంగా బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘షకీలా: నాట్‌ ఎ పోర్న్‌ స్టార్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బాలీవుడ్‌ నటి రిచా చద్దా ఈ చిత్రంలో షకీలా పాత్రలో నటిస్తున్నారు. ఇంద్రజిత్‌ లంకేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా షకీలా ఓ ఇంటర్వ్యూలో తన లవ్‌ ఫెయిల్యూర్‌ గురించి బయటపెట్టారు.

‘2007లో ‘చోటా ముంబయి’ అనే సినిమాలో నటిస్తున్న రోజులవి. మా అమ్మకు సుస్తీ చేసింది. వెంటనే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దాంతో నేను ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న మణ్యన్‌పిల్ల రాజును కలిశాను. సినిమాలో నేను నటించాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నప్పటికీ మా అమ్మకు ఆరోగ్యం సరిగా లేదని తెలీగానే నాకు ముందుగానే పారితోషికం మొత్తం ఇచ్చేశారాయన. ఆయన మంచితనం నాకు చాలా నచ్చింది. రాజు సర్‌తో ప్రేమతో పడ్డాను. ఈ విషయం తనకు చెప్పాలని లవ్‌ లెటర్‌ రాశాను. కానీ ఆయన నుంచి నాకు ఎలాంటి స్పందన రాలేదు. ఏ స్పందనా రాకపోవడం కూడా ఓ సమాధానమే కదా. ఆయన నా ప్రపోజల్‌ను తిరస్కరించారని అర్థమైంది. దాంతో మర్చిపోవాలనుకున్నా’ అని వెల్లడించారు షకీలా.

CLICK HERE!! For the aha Latest Updates