HomeTelugu Big Storiesహిందీ 'జెర్సీ' ట్రైలర్‌

హిందీ ‘జెర్సీ’ ట్రైలర్‌

Jersey movie Official Trail
షాహిద్‌ కపూర్‌ కీలక పాత్రలో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్‌ చిత్రం ‘జెర్సీ’. తెలుగులో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రాన్నే గౌతమ్‌ హిందీలోనూ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

క్రికెటర్‌గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్‌ బ్యాట్‌ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! అల్లు అరవింద్‌, దిల్‌రాజు, అమన్‌ గిల్‌; నాగవంశీలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ నేపథ్య సంగీతం అందిస్తుండగా, సాకేత్‌ పరంపర సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu