
Villain in Vijay Deverakonda’s next:
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ క్రైమ్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.. ప్రస్తుతం ఆఖరి దశలో ఉంది. ఇప్పటికే సినిమాలో సినిమాలో కీలక పాత్రల కోసం పాపులర్ ఆర్టిస్టులను ఎంచుకున్నారు.
ఇందులో సత్యదేవ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఈ సినిమాలో ఆయన షూటింగ్ ప్రారంభించారు. సత్యదేవ్ పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉండేలా డిజైన్ చేశారట. ఈ పాత్రలో ఆయన అద్భుతమైన నటన చూసి యూనిట్ సభ్యులు ప్రశంసిస్తున్నారు అని సమాచారం.
ప్రత్యేకంగా, విజయ్ దేవరకొండతో సత్యదేవ్ మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయట. ఈ చిత్రంలో భగ్యశ్రీ బోర్సే ప్రధాన కథానాయికగా నటిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి యాక్షన్ సినిమానే అయిన చాలా విభిన్నంగా తెరకెక్కిస్తున్నారు.
కథ, స్క్రీన్‌ప్లేతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. కరోనా కాలంలో వరుస హిట్లతో సత్యదేవ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన నటించిన “జీబ్రా” బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.