నా నువ్వులోనే నువ్వున్నావ్: జాన్వీ

అతిలోకసుందరి శ్రీదేవి అనంతలోకాల్లో కలిసిపోయి నేటికి ఏడాది అవుతోంది. ఆమె తొలి వర్ధంతిని పురస్కరించుకుని కుమార్తె జాన్వి కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. ‘నా హృదయం ఎప్పుడూ భారంగానే ఉంటుంది. కానీ నేను నవ్వుతూనే ఉంటాను. ఎందుకంటే ఆ నువ్వులోనే నువ్వున్నావ్‌..’ అని పోస్ట్‌ చేస్తూ.. తన తల్లి చెయ్యిపట్టుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అభిమానులూ ఆమెను స్మరించుకుంటున్నారు.

గతేడాది మేనల్లుడి వివాహం నిమిత్తం కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి.. అక్కడి ఓ హోటల్లోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడి కన్నుమూశారు. శ్రీదేవి హఠాన్మరణం ఆమె కుటుంబాన్ని, చిత్రపరిశ్రమను శోకసంద్రంలోకి నెట్టింది. ఇప్పటికీ శ్రీదేవి లేరన్న నిజాన్ని నమ్మలేకపోతున్నామని పలువురు ప్రముఖులు ఆమెను గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.

https://www.instagram.com/p/BuOra4rn8L2/?utm_source=ig_web_copy_link