టైగర్ ష్రాప్ చేతుల మీదుగా ‘నన్ను దోచుకుందువటే’ ట్రైలర్‌

యంగ్ హీరో సుధీర్‌బాబు నటిస్తూ, సొంతంగా నిర్మిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఈ సినిమాకి ఆర్‌.ఎస్‌. నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌లో సినిమా కాన్సెప్ట్‌ మొత్తం తెలియజేశారు. సుధీర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మేనేజర్‌గా, అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్‌ నభా నటేష్‌ కనిపించింది. రొమాంటిక్‌ కామెడీ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాప్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలా ట్రైలర్ ను కట్ చేశారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సురేష్‌ రగుతు, అజనీష్‌ బి.లోకనాథ్‌ సంగీతం అందించారు.