HomeTelugu Big Storiesబైక్‌ పై కొడుకుతో ఎన్టీఆర్‌.. ఫొటో వైరల్‌

బైక్‌ పై కొడుకుతో ఎన్టీఆర్‌.. ఫొటో వైరల్‌

Junior ntr bike rides with
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతరం దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నాడు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న విడుదల కానుంది. వీటి తర్వాత ‘కేజీఎఫ్‌’ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

దీనికి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే రోజున అంటే మే 30న రానుంది. ఇదిలా వుంటే తారక్‌ ఆదివారం నాడు తన కొడుకుతో కలిసి ఎంజాయ్‌ చేశాడు. రెండో తనయుడు భార్గవ్‌రామ్‌ను బైక్‌ మీద ఎక్కించుకుని హైదరాబాద్‌ రోడ్ల మీద షికారుకెళ్లాడు. కొడుకు కోరిక మేరకు తారక్‌ అతడిని బైక్‌ మీద ఎక్కించుకుని సంతోషపర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని తాలూకూ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి

Recent Articles English

Gallery

Recent Articles Telugu