పృధ్వీ విడాకుల కేసు తీర్పు వచ్చేసింది!

కమెడియన్ పృద్వీ 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో పృద్వీకి సినిమాల్లో అవకాశాలు బాగా పెరిగాయి. అయితే తన భార్యతో తరచూ విభేదాలు తలెత్తడంతో గతేడాది ఆమెను ఇంటి నుండి గెంటేశాడు. పెద్దలు రాజీకి ప్రయత్నించినా.. పృధ్వీ పట్టించుకోలేదు. దీంతో ఆయన భార్య శ్రీలక్షి గత నవంబర్ లో అతడిపై ఫిర్యాదు చేసింది. కుటుంబ న్యాయస్థానంలో భరణంగా కోరుతూ కేసు ఫైల్ అయింది. 1984లో వీరిద్దరికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు విదేశాల్లో సెటిల్ అయ్యారు. అయితే ఇక భార్య, భర్తలు ఇద్దరికీ కూడా ఒకరితో ఒకరు కలిసి ఉండడం ఇష్టం లేకపోవడంతో కోర్టులో కేసు దాఖలు చేశారు. 
తన భర్త ఆదాయ పరిస్థితి బాగానే ఉందని.. భరణం కింద నెలకు పది లక్షల రూపాయలు చెల్లించమని ఫ్యామిలీ కోర్టుకి తెలిపారు శ్రీలక్ష్మి. కేసు విచారించిన న్యాయస్థానం ఆమెకు నెలకు 8 లక్షల రూపాయల వరకు భరణం చెల్లించాలని పృధ్వీకి సూచించింది. గతంలో పృధ్వీ తనను మోసం చేశాడంటూ.. కవిత అనే మరో మహిళ కూడా ఆయనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనను వివాహం చేసుకొని నాలుగేళ్ళు కాపురం చేసి మోసం చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్నాడని తన కంప్లైంట్ లో పేర్కొంది.