HomeTelugu Trendingమరో హీరో సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్..!

మరో హీరో సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్..!

1 20
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ లతోనే కాదు తన పాటలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని అందరికి తెలుసు. ఇప్పటికే తన సినిమాల్లో అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతున్నాడు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ తన గొంతును సవరించనున్నాడు. అదీ తన సినిమా కోసం కాదు.. మరో హీరో కోసం. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్టర్’లో ఎన్టీఆర్ ఓ పాట పాడబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో విజయ్ ఒక పాట పాడాడు. కుట్టి స్టోరీ అంటూ సాగే పాటను విజయ్, అనిరుద్ కలిసి పాడారు. ఇదే పాటను తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ పాడనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ పాట రికార్డింగ్ కానుంది. ఖైదీ ఫేమ్ లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu