HomeTelugu Trendingక్వారంటైన్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీం

క్వారంటైన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం

RRR movie actors in quara

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతించడంతో… మళ్లీ షూటింగ్ కు సన్నాహకాలు చేసుకుంటున్నారు.

ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ను మళ్లీ పట్టాలెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా షూటింగ్ లో పాల్గొనే నటులందరూ ఈ నెల 10 నుంచి హోటల్స్ లో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు షూటింగ్ సమయంలో ఉపయోగించే సామగ్రిని శానిటైజ్ చేయించడానికి, థర్మల్ స్క్రీనింగ్ ద్వారా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu