స్టార్ హీరోతో జ్యోతిక!

ఒకప్పటి అగ్ర హీరోయిన్ జ్యోతిక.. పెళ్ళైన తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. పిల్లలు పుట్టిన అనంతరం ఇక సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించి తన భర్త సూర్య నిర్మించిన బ్యానర్ లోనే ఓ సినిమాలో నటించింది. అయితే ఇప్పుడు హీరో విజయ్ నటిస్తోన్న సినిమాలో
అమ్మడుకి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ ‘భైరవ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన నటించబోయే 61వ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథను అందించబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన్ జ్యోతిక కనిపించనుందని సమాచారం. ఈ సినిమాలో గ్లామర్ పార్ట్ కోసం సెపరేట్ గా హీరోయిన్స్ గా ఉన్నట్లు తెలుస్తోంది. జ్యోతిక పాత్ర మాత్రం డీసెంట్ గా ఉంటుందని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఖుషీ’ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు 14 ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ కానుండడం విశేషం.