నేనే మహేష్‌బాబులా ఉండుంటే.. కేఏ పాల్ కామెడీ.. ఆడుకుంటున్న నెటిజన్లు

కేఏ పాల్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. కేఏ పాల్‌పై సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలపై కేఏ పాల్ చేసే వ్యాఖ్యలు ఆకాశానికి నిచ్చెన వేసినట్లు ఉంటున్నాయి. తాను ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సీఎం అని మిగతా పార్టీలు అన్నీ తుడిచిపెట్టుకు పోతాయని, జగన్‌, చంద్రబాబు తన ముందు దిగదుడుపే అని ప్రముఖ రాజకీయ నేతలందరినీ ఓ రేంజ్‌లో వేసుకుంటున్న కేఏ పాల్ తాజాగా మరో కామెడీ చేశారు. పోకిరి సినిమాలో బ్ర‌హ్మానందం కారెక్ట‌ర్ గుర్తుండే ఉంటుంది కదా.. ఆ సినిమాలో కాలేజ్ అమ్మాయి రాసే ల‌వ్ లెట‌ర్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. పీపుల్ హౌ క్రేజీ అబౌట్ మీ ఐ డోంటో నో అంటూ త‌న అందం మీద తానే సెటైర్లు వేసుకోవడం మనందరినీ ఎంతో ఎంటర్‌టైన్ చేసింది క‌దా. ఇప్పుడు కేఏ పాల్ కూడా అదే రేంజ్‌లో కామెడీ చేస్తున్నారు.

ప్ర‌జాశాంతి పార్టీతో ప్ర‌పంచ శాంతి నెల‌కొల్పుతానంటూ వాగ్ధానాలు ఇస్తుంటాడు కేఏ పాల్. ఇప్పుడు ఈయ‌నేం చెప్పినా ముందు న‌వ్వే వ‌స్తుంది. ఎందుకంటే అలా మారిపోయాడు పాల్. ఈయ‌నేం మాట్లాడినా కూడా అందులో కామెడీ ఎక్క‌డుందా అని వెతుక్కుంటూ ఉంటారు యూ ట్యూబ్ ఛానెల్స్ కూడా. అందుకే సోష‌ల్ మీడియాలో ఎవ‌ర్ గ్రీన్ టాప్ క‌మెడియ‌న్ ఎవ‌రైనా ఉన్నారా అంటే అది కేఏ పాల్ మాత్ర‌మే. అప్పుడ‌ప్పుడూ ఈయ‌న మాట్లాడే మాట‌లు సంచ‌ల‌నం సృష్టిస్తుంటాయి. ఇప్పుడు మ‌హేష్ బాబు గురించి కూడా ఇలాంటి కామెంట్స్ చేసాడు కేఏ పాల్. ఈయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు మ‌హేష్ బాబు అభిమానుల‌కు కూడా కోపం తెప్పిస్తున్నాయి.

విమానంలో కూడా సెల్ఫీలు తీసుకున్నార‌ని.. తాను ఇలా ఉంటేనే ప‌రిస్థితి ఇలా ఉంది.. మ‌హేష్ బాబులా అందంగా ఉండి ఉంటే త‌న రేంజ్ మ‌రోలా ఉండేద‌ని చెప్పాడు కేఏ పాల్. అక్క‌డితో ఆగ‌కుండా అప్ప‌ట్లో సూపర్‌ స్టార్ కృష్ణ త‌న ద‌గ్గ‌రకు ఆశీర్వాదం కోసం వ‌చ్చిన‌పుడు మ‌హేష్ చాలా చిన్న పిల్లోడు అంటూ చెప్ప‌డం విశేషం. ఇది చూసి మ‌హేష్ ఫ్యాన్స్ కూడా పాల్‌పై సెటైర్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మెడలో నిమ్మ‌కాయ‌లు వేసుకుంటే దిష్టి బొమ్మ‌లా ఉంటావ్.. నువ్వు మ‌హేష్ బాబువా అంటూ ఆడుకుంటున్నారు.