‘మహర్షి’ పూర్తి.. గుమ్మడికాయ కొట్టి కేక్‌ కట్‌ చేశారు

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సినిమా అంటే చాలా సమాయంతో కూడుకొని ఉంటుందనే భావన టాలీవుడ్ పరిశ్రమలో వినిపిస్తోంది. కారణం ఏవైనా కావొచ్చు.. నిర్మాణం అంత స్పీడ్ గా జరగదు. అయితే ‘మహర్షి’ సినిమా షూటింగ్ నిన్నటితో పూర్తయింది. ఈ విషయాన్ని మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

సినిమా షూటింగ్ పూర్తయిందని చెప్పి గుమ్మడికాయ కొట్టి కేక్ కట్ చేశారు. సినిమా విడుదలకు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో నిర్మాణాంతర కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నది యూనిట్.