నటికాకపోతే.. విలేకర్లతో కాజల్‌ ముచట్లు

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తాను నటిని కాకపోయి ఉండి ఉంటే వ్యోమగామిగా అయ్యేదానినని అన్నారు. ఇటీవల ఈ చందమామ విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా నటి కాకపోయి ఉండి ఉంటే ఏమై ఉండేవారు? అని కాజల్‌ను విలేకరి ప్రశ్నించగా.. ‘ఒకవేళ నేను నటిని కాకపోయి ఉండి ఉంటే వ్యోమగామినో లేకపోతే కేశాలంకరణ నిపుణురాలినో అయ్యేదానిని. నాకు సైన్స్‌ అంటే చాలా ఇష్టం అందుకే వ్యోమగామిని అవ్వాలనుకున్నాను. అంతేకాకుండా నాకు చిన్నప్పటి నుంచి జుట్టును రకరకాల డిజైన్లలతో అలంకరించడం అలవాటు. సినిమాల్లోకి రాకముందు నిషాకు డబ్బులు ఇచ్చి కూర్చొబెట్టి రకరకాల జడలను వేసేదాన్ని. చివరికి అనుకోకుండా నటిగా మారాను.’ అని కాజల్‌ తెలిపారు.

‘చందమామ’ చిత్రంతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన నటి కాజల్‌ అగర్వాల్‌. ఆ తర్వాత ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా మారారు. ప్రస్తుతం ఆమె కమల్‌ హాసన్‌ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ 2’ సినిమాలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ వృద్ధురాలి పాత్రలో కనిపించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాజల్‌ ‘ముంబయి సాగా’, ‘కాల్‌సెంటర్‌’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates