HomeTelugu Trendingకామెడీ హీరోకు జంటగా కాజల్‌ అగర్వాల్‌!

కామెడీ హీరోకు జంటగా కాజల్‌ అగర్వాల్‌!

3 7
హస్యనటుడు అల్లరి నరేష్ ‘సుడిగాడు’ సినిమా తర్వాత సరైన హిట్‌ కోసం ఎదురు చుస్తున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసిన అవి ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. మల్టీస్టారర్ సినిమాలు చేసిన కూడా ఈ సడన్‌ స్టార్‌కు కలిసి రాలేదు. దాంతో సైడ్ క్యారెక్టర్స్ ను ఎంచుకున్నాడు. మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన ‘మహర్షి’ సినిమాలో మహేష్ ఫ్రెండ్ క్యరెక్టర్ లో అదరగొట్టాడు. తాజాగా నాంది అనే ఇంట్రస్టింగ్ సినిమాలో నటిస్తున్నాడు నరేష్.

తాజా సమాచారం ప్రకారం అల్లరి నరేష్ త్వరలో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ప్రొడ్యూసర్‌ గా త్వరలో ఓ కొరియన్ మూవీ రిమేక్ గా రాబోతుందనట్లు సమాచారం. ఈ సినిమాలో నరేష్ జోడిగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించనున్నదని వినికిడి. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. సురేష్ ప్రొడక్షన్స్ కాబట్టి దాదాపు కాజల్ కన్ఫామ్ అయ్యినట్టే అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నరేష్ ఓ లాయిర్ గా నటించబోతున్నాడట. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!