30 దాటినా తన అందాలతో పిచ్చెక్కిస్తున్న కాజల్‌


సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే హీరోయిన్లు ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండాలి. దానికోసం హాట్ ఫొటో షూట్‌లు చేస్తూ తనలో ఉన్న అందాన్ని కొత్తగా చూపిస్తూ ఉండాలి. ఇప్పుడు దాదాపు హీరోయిన్లంతా అదే పని చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఇది మరింత ఎక్కువగా మారిపోయింది. తాజాగా కాజల్ అదే పని చేస్తోంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పన్నెండేళ్లు కావొస్తున్నా ఇప్ప‌టికీ తన ఇమేజ్ మాత్రం అస్స‌లు త‌గ్గ‌డం లేదు. దానికి తోడు కుర్ర హీరోయిన్ల‌తో పోటీ త‌ట్టుకోవడానికి హాట్ ఫొటోషూట్స్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మ‌రోసారి ఇదే చేసిందీ బ్యూటీ. ఈమె చేసిన ఓ ఫొటోషూట్ సెగ‌లు పుట్టిస్తోంది.

వ‌య‌సు 30 దాటేసినా కూడా ఇప్ప‌టికీ అదే దూకుడు.. అదే అందాల‌తో చంపేస్తుందీ ముద్దుగుమ్మ. చీర‌క‌ట్టినా.. చుడీదార్ వేసినా.. మోడ్ర‌న్ డ్ర‌స్ వేసినా ఎందులో అయినా కాజ‌ల్ క‌మాల్ చేస్తుంది. అలా చూస్తూ ఉండిపోతాం అంతే. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ బ్యూటీ. ఓ వైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నా కూడా మ‌ధ్య‌లో హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానుల‌ను ఊరిస్తుంది. తాజాగా బికినీని త‌ల‌పించే డ్ర‌స్సులో అమ్మ‌డు చేసిన ర‌చ్చ అదుర్స్‌ అనిపిస్తోంది.

సోష‌ల్ మీడియాలో కాజ‌ల్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అక్క‌డే త‌న అందాల విందు చేయిస్తుంది కాజ‌ల్. ప్ర‌స్తుతం ఈ భామ మూడు సినిమాలు చేస్తుంది. క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2లో ఈమె హీరోయిన్. బెల్లంకొండ‌తో తేజ తెర‌కెక్కిస్తున్న సీత సినిమాలో న‌టిస్తుంది కాజ‌ల్. ఇక శ‌ర్వానంద్-సుధీర్‌వ‌ర్మ సినిమాలో డాక్ట‌ర్‌గా న‌టిస్తుంది కాజల్. క్వీన్ త‌మిళ రీమేక్ పారిస్ పారిస్ లోనూ న‌టిస్తోంది‌. గ‌తేడాది వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో న‌టించిన కాజ‌ల్.. ఇప్పుడు మాత్రం చిన్న హీరోలు.. చిన్న సినిమాల‌తో స‌రిపెట్టుకుంటుంది. కానీ రెమ్యున‌రేష‌న్ మాత్రం సినిమాకు కోటికి పైగానే తీసుకుంటూ ర‌చ్చ చేస్తోంది.