Homeతెలుగు Newsకాజల్ వట్టి పోలేదండోయ్.. గట్టి పడింది !

కాజల్ వట్టి పోలేదండోయ్.. గట్టి పడింది !

Kajal is not lost.. it is hard

2004 లో వచ్చిన ‘క్యూ….హో గయా నా’ అనే సినిమా నుంచి నేటికీ కాజల్ అగర్వాల్ నటిస్తూనే ఉంది. అంటే 19 ఏళ్లు… ఇండియన్ సినిమాలో సగటు హీరోయిన్ ఆయుష్షుతో పోలిస్తే కాజల్ అగర్వాల్ సినీ ఆయష్షు చాలా ఎక్కువ… ఆ మధ్య ఇక కాజల్ అగర్వాల్ పనైపోయిందన్నారు అందరూ… పైగా కాజల్ కి పెళ్లి అయ్యి, తల్లి కూడా అయ్యిపోయింది. కాజల్ అగర్వాల్ వయస్సు 38 సంవత్సరాలు. దాంతో కాజల్ ముసలిదైపోయిందని, వట్టిపోయిందని ఆమెను ట్రోల్ కూడా చేశారు. మరికొందరు అయితే కాజల్ ను తిట్టిపోశారు కూడా… ఐతే, ఖైదీ నెంబర్ 150 తో మళ్లీ పట్టాలెక్కిన కాజల్ అగర్వాల్.. తాజాగా సోషల్ మీడియాలో అందాల మెరుపులు మెరిపిస్తోంది. పాత కాజల్ అగర్వాల్ ను గుర్తుచేస్తోంది… కాజల్ అగర్వాల్ పని అయిపోయిందని కూసిన నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయి.

పైగా ఇప్పుడు కాజల్ అగర్వాల్ చేతిలో మూడు భారీ సినిమాలు ఉన్నాయి. ముప్పై ఎనిమిదేళ్లు వయస్సొచ్చినా సరే, పాతిక లోపే అన్నట్టు కనిపిస్తున్న కాజల్ అగర్వాల్ చేతిలో ఉన్న ఇండియన్ 2 సినిమా తాజా సంచలనం… అంత వయస్సొచ్చింది కదాని చిన్న హీరోల పక్కన కనిపించడం లేదు… ఇండియన్ 2 సినిమా హీరో కమల్ హాసన్.. అలాగే మరో స్టార్ హీరో బాలయ్య సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న బాలయ్య సినిమాకి, అలాగే.. సౌత్‌లో ఇండియన్సి 2 నిమాకూ భారీ డిమాండ్ ఉంది. పైగా ఇది పాన్ ఇండియా సినిమా. కమల్ హాసన్ సినీ కెరీర్ లో ఎప్పుడూ లేనంత హైప్ క్రియేటైంది ఇండియన్ 2 సినిమాకు.

వస్తున్న వార్తల ప్రకారం… ఇండియన్ 2 చిత్రం శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్, థియేటరికల్ రైట్స్ అన్నీ కలిపి 100 కోట్ల ప్రిరిలీజ్ రికవరీ… అంటే రిలీజుకు ముందే 100 కోట్లు చేతుల్లో పడ్డట్టు లెక్క… మరి ఈ రేంజ్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా వస్తున్న ఇండియన్ 2 సినిమాకి బిజినెస్ జరగడంతో ఇప్పుడు ఆమె కెరీర్ కి మరింత ఊపు పెరిగింది. పైగా కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో కమల్ హాసన్ ఇండియన్ 2 ప్రసారానికి నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 80 కోట్లు ఇస్తోంది. ఇంతటి ప్రిస్టేజియస్ ప్రాజెక్టుకు కూడా కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు నిర్మాతలు, దర్శకుడు. అదీ కాజల్ అగర్వాల్ తాజా డిమాండ్.

ఇక ఈ ఇండియన్ 2 సినిమా ఓ మోస్తరుగా ఉన్నా సరే, మొత్తం వసూళ్లు దుమ్మురేపడం ఖాయం…అప్పుడు కాజల్ అగర్వాల్ కి పూర్వ వైభవం… కాదు, దాన్ని మించి దూసుకుపోతోంది ఏమో చూడాలి. అన్నిటికీ మించి కాజల్ అగర్వాల్ చేతిలో బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా కూడా ఉంది. సో.. ఏ రకంగా చూసుకున్నా.. కాజల్ అగర్వాల్ కి మళ్లీ మంచి కాలం నడిచేలానే కనిపిస్తోంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!