ఆసక్తికర టైటిల్‌తో కళ్యాణ్‌రామ్‌

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘ఎంత మంచివాడవురా!’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శుక్రవారం కళ్యాణ్‌రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు. వర్షంలో తడుస్తున్న ఇద్దరు చిన్నారులకు మొక్కజొన్న కండి కొనిచ్చి సైకిల్‌పై వెళ్తున్న సమయంలో ‘ఎంత మంచివాడవురా’ అంటూ అక్కినేని నటించిన ‘నమ్మినబంటు’ చిత్రంలోని పాటతో విడుదల చేసిన ఈ టైటిల్‌ టీజర్‌ ఆకట్టుకుంది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.