మరో డిఫరెంట్ మూవీతో కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ 118 విజయంతో మంచి జోష్ మీద ఉన్నాడు ఇకపై రోటీన్ సినిమాలు చేస్తే లాభం లేదనుకున్న ఆయన భిన్నమైన కథలని ఎంపిక చేసుకుంటున్నాడు. సినిమా పేరు దగ్గర్నుండి కథనం, పాత్రలు అన్నీ విభిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాడు. ‘118’ సినిమాలో తనలోని ఛేజ్‌ చూపించిన ఆయన ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. కళ్యాణ్‌ తర్వాతి సినిమాకు ‘అశ్వథామ’ అనే టైటిల్ ఫిక్స్ అనుకుంటున్నారట. ఈ సినిమా హిస్టారిక్ ఎలిమెంట్స్ ఆధారంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాను నూతన దర్శకుడు మల్లాది విశిష్ట డైరెక్ట్ చేయనున్నాడు.