HomeTelugu Trendingప్రభాస్‌ విడుదల చేసిన 'కల్యాణం కమనీయం' సాంగ్‌

ప్రభాస్‌ విడుదల చేసిన ‘కల్యాణం కమనీయం’ సాంగ్‌

Kalyanam Kamaneeyam Wedding
సంతోష్ శోభన్ హీరోగా యూవీ కాన్సెప్ట్స్ వారు నిర్మించిన చిత్రం ‘ కల్యాణం కమనీయం’. ఈ సినిమాకి అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. ప్రియా భవాని శంకర్ హీరోగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ప్రభాస్ చేతుల మీదుగా ఒక సాంగ్ ను రిలీజ్ చేయించారు. ‘సింగిల్ లైఫ్ అంటే సింపుల్ అంటారు .. బాబూ చెయ్యొద్దా తప్పు’ అంటూ ఈ పాట మొదలవుతోంది. ‘కల్యాణం కమనీయం కద బాసూ .. అరె సోలోగున్నావంటే ఉండదు జోషు’ అంటూ నడుస్తుంది.

శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించాడు. ఈ పాటకి యశ్ కొరియోగ్రఫీని నిర్వహించాడు. పెళ్లికి శర్వానంద్ ను హీరో ఒప్పించడమనే ఒక కాన్సెప్ట్ ను తీసుకుని, ఆ అంశానికి ఈ పాటను లింక్ చేసి వదిలారు. పెద్ద సినిమాల మధ్యలో బరిలోకి దిగుతున్న ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu