HomeTelugu Trendingసంతోష్ శోభన్‌కి జంటగా మెహ్రీన్‌!

సంతోష్ శోభన్‌కి జంటగా మెహ్రీన్‌!

Mehreen opposite santosh
టాలీవుడ్‌లో మెహ్రీన్‌ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ‘ఎఫ్ 3’ సినిమాలో నటిస్తుంది. తాజాగా ఆమె మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోందని అంటున్నారు. సంతోష్ శోభన్ హీరోగా మారుతి ఒక చిన్న సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ జోడీగా ఆయన మెహ్రీన్ ను ఒప్పించాడని అంటున్నారు. గతంలో తనకి ‘మహానుభావుడు’ వంటి హిట్ ఇచ్చిన కారణంగా మెహ్రీన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ .. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగు జరుగుతోందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. కాగా ఇటీవలే మెహ్రీన్‌కి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఇక సంతోష్‌ ఇటీవల ఏక్ మినీ కథ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం మంచి క్రేజ్ అందుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu