HomeTelugu Trendingప్రముఖ జర్నలిస్ట్ పై కంగనా వ్యాఖ్యలు

ప్రముఖ జర్నలిస్ట్ పై కంగనా వ్యాఖ్యలు

Kangana fires on journalist
బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశం అవుతూనే ఉంది. ఎంత పెద్ద స్టార్ ను అయినా కూడా కంగనా రనౌత్ తనదైన తీరులో లో తీసి పక్కన పెట్టేసేలా మాట్లాడుతుంది. ఇప్పటికే బాలీవుడ్ లో సగం మంది స్టార్స్ తో ఈమెకు సరైన అనుబంధం లేదనే టాక్ ఉంది. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ పై కంగనా విమర్శలు చేసింది. గతంలో కంగనా ”ముంబై ఎందుకు నాకు పీవోకేలా అనిపిస్తోంది?” అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సందర్భములో కంగనాకు మద్దతుగా జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌ నిలిచారు. అయితే ”కంగన అభిప్రాయాన్ని ఎవరైనా గట్టిగా వ్యతిరేకించవచ్చు. అయితే, బెదిరింపులు మాత్రం ఆమోదయోగ్యం కాదు” అని ట్వీట్ చేశారు. దానికి కంగనా స్పందిస్తూ ”ముంబై విడిచి వెళ్లిపోవాలని మీరు వాట్సాప్‌లో మీమ్ పోస్టు చేశారు. కానీ ఇప్పుడు మీరు నాకు అండగా నిలబడ్డారు. నా వాక్ స్వాతంత్ర్యానికి మద్దతుగా నిలుస్తున్నారు. దీనిని నేను అంగీకరిస్తున్నాను. ప్రామాణికమైన ఉదారవాదుల పట్ల నాకు నిజమైన గౌరవం ఉంది. మీరు అదే మాట మీద నిలబడి నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను” అని కంగన ట్వీట్‌ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!