విద్యాబాలన్‌పై కంగనా ప్రశంసలు


బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. విద్యాబాలన్‌ను ప్రశంసించింది. దర్శకుడు మిలన్ లూధ్రియా ‘ది డర్టీ పిక్చర్’ను తొలుత కంగనా రనౌత్ తోనే తీయాలనుకున్నాడు. కానీ ఆమె అంగీకరించకపోవడంతో ఆ పాత్ర విద్యాబాలన్ కు లభించింది. ఆ సినిమాతో విద్యా బాలన్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. ‘ది డర్టీ పిక్చర్’ కంటే ముందు మిలన్.. కంగనాతో ‘వన్స్ అపానే టైమ్ ఇన్ ముంబై’ మూవీ చేశాడు. ఆ కారణంగానే ‘ది డర్టీ పిక్చర్’ ఆఫర్ కూడా కంగనాకు ఇచ్చాడు. అయితే… ఈ సినిమా పొటన్షియాలిటీని గుర్తించడంలో తాను విఫలమయ్యానని, అందుకు ఇప్పుడేమీ బాధపడటం లేదని కంగనా తెలిపింది. విద్యాబాలన్ అందులో సిల్క్ స్మిత పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చిందని, ఆ పని తనవల్ల కాదని కూడా కంగనా అంగీకరించింది.

CLICK HERE!! For the aha Latest Updates