బాలీవుడ్ స్టార్స్‌ దొరికిపోవడం ఖాయం: కంగనా

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ మరో బాంబు పేల్చింది. నార్కోటిక్స్‌ బ్యూరో బాలీవుడ్‌ లో కానీ రక్త పరీక్షలు చేస్తే ఏ లిస్ట్‌ వ్యక్తులందరూ బయటపడతారని ట్వీట్‌ చేసింది కంగనా. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా కేంద్రం బాలీవుడ్‌ని క్లీన్‌ చేస్తే మంచిదని సైటర్‌ వేసింది. బాలీవుడ్‌ మాఫియాను కంట్రోల్‌ చేస్తే మంచిదని అభిప్రాయపడింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి కంగనా స్టార్‌ కిడ్స్‌, నిర్మాత కరణ్‌ జోహర్‌లతో పాటు పలువురు నటీనటులపై విరుచుకుపడుతోంది. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో విచారణ ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక కోణంలో ఈడీ, సీబీఐ విచారణ ముమ్మరం చేశాయి .తాజాగా సుశాంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ రియాచక్రవర్తికి.. డ్రగ్ లింక్స్‌తో సంబంధాలున్నాయని ఈడీ తేల్చింది. దీన్ని నార్కోటిక్ కంట్రోల్ బోర్డుకు రిఫర్ చేసింది. రంగంలోకి దిగిన నార్కోటిక్స్‌ బ్యూరో రియాపై కేసు ఫైల్ చేసింది. రియా సోదరుడి పేరును లిస్టులో చేర్చింది. అయితే తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని రియా స్పష్టం చేసింది.

CLICK HERE!! For the aha Latest Updates