HomeTelugu Reviews'కాతు వాకుల రెండు కాదల్‌' మూవీ రివ్యూ

‘కాతు వాకుల రెండు కాదల్‌’ మూవీ రివ్యూ

Kanmani Rambo Khatija Movie Review

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత, లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార, కోలీవుడ్‌ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్‌’. విఘ్నేష్‌ శివన్‌ డైరెక్షన్‌లో రొమాంటిక్‌, కామెడీ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కింది ఈ సినిమా. కోలీవుడ్‌ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాను రౌడీ పిక్చర్స్‌, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. నేడు (ఏప్రిల్‌ 28) సమంత పుట్టినరోజు సందర్భంగా తెలుగులో ‘కణ్మనీ రాంబో ఖతీజా’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. మరీ ఈ మూవీ ఎలా ఉంది ? ఇద్దరు అమ్మాయిలైన కణ్మనీ, ఖతీజాల మధ్య రాంబో ఎలా నలిగిపోయాడు ? అనేది మూవీ రివ్యూలో చూద్దాం.

కథ : రాంబో(విజయ్‌ సేతుపతి) పుట్టుకతోనే దురదృష్టవంతుడిగా పేరు తెచ్చుకుంటాడు. అతను పుట్టగానే తండ్రి చనిపోతాడు. తల్లి అనారోగ్యం పాలవుతుంది. దీంతో రాంబో కూడా నిజంగానే తాను దురదృష్టవంతుడినని, తన వల్లనే తల్లి అనారోగ్యపాలైందని భావించి చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. తను ఇష్టపడిన వాళ్లకు కీడు జరుగుతుందని భావించి, మూడు పదుల వయసు వచ్చినా.. ప్రేమ, పెళ్లి జోలికి వెళ్లడు. ఆ టైమ్‌ లో అతనికి పరిచయమవుతారు కన్మణి(నయనతార), ఖతీజా(సమంత). ఇద్దరిని సమానంగా ప్రేమిస్తాడు రాంబో. ఒకరితో పగలంతా గడిపితే.. మరొకరికి రాత్రి సమయం కేటాయిస్తాడు. అయితే ఓ రోజు కన్మణి, ఖతీజాలకు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ పెళ్లి దాకా వెళ్లిందా? చివరకు రాంబో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. అనేదే మిగతా కథ.

Kanmani rambo khatija movie

నటీనటులు : విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. రాంబోగా విజయ్‌ అలరించాడు. సినిమాతో అతనికి పాత్రకే సరైన జస్టిఫికేషన్‌ ఉంది. అందువల్ల ఆడియన్స్‌ ఎక్కువగా రాంబో పాత్రకు కనెక్ట్‌ అవుతారు. ఇక కన్మణిగా నయనతార తనదైన నటనతో అదగొడితే.. ఖతీజాగా సమంత తన అందంతో ఆకట్టుకుంది. టీవీ షో వ్యాఖ్యాతగా ప్రభు, ఖతీజా తొలి బాయ్‌ప్రెండ్‌ మహ్మద్‌ మోబీగా శ్రీషాంత్‌ తమ, తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ:
విజయ్‌ సేతుపతి, సమంత, నయనతార లాంటి స్టార్‌ లు కలిసి నటిస్తున్నారంటే.. ఆ సినిమాపై కచ్చితంగా భారీ అంచనాలే ఉంటాయి. డైరోక్టర్‌ కూడా అదే స్థాయిలో మంచి కథని ఎంచుకొని సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తాడు. కానీ విగ్నేశ్‌ శివన్‌ మాత్రం పేలవమైన కథతో ‘కాతు వాకుల రెండు కాదల్‌’ చిత్రాన్ని తెరకెక్కించాడు. స్టోరీని పక్కకు పెట్టి.. కేవలం స్టార్‌ క్యాస్ట్‌ మీదే ఎక్కువ ఆధారపడ్డాడు. కథ, కథనాల్లో పసలేకపోవడం వల్ల ఈ సినిమా పేలవంగా సాగుతుంది. హీరోని ఇద్దరు హీరోయిన్లు ప్రేమించడం.. అతన్ని దక్కించుకునేందుకు ఇద్దరు పోటీపడడం, వాళ్ల వల్ల హీరోకు సమస్యలు రావడం..చివరకు ఇద్దరితో హీరో కలిసి ఉండడం.. ఈ తరహా ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలు తెలుగు, తమిళ బాషలో చాలానే వచ్చాయి. ‘కణ్మనీ రాంబో ఖతీజా’లో కొత్తదనం ఏమీ లేకపోవడం.. కథనం చాలా నెమ్మదిగా సాగడంతో ఫస్టాఫ్‌ అంతో బోర్‌ కొడుతుంది. ఇంటర్వెల్‌ ముందు హీరో చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది.

ఇక సెకండాఫ్‌లో అక్కడక్కడ కామెడీ, కొన్ని డైలాగ్స్‌ అలరించినా.. అంత ఆసక్తిగా మాత్రం కథనం సాగదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా.. చాలా సింపుల్‌గా సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు తెరపై స్టార్‌ క్యాస్ట్‌ తప్ప కథలో కొత్తదనం కనిపించదు. ఎమోషనల్‌ సీన్స్‌ కూడా వర్కౌట్‌ కాలేదు. రొటీన్‌ స్క్రీన్‌ప్లే. పాన్‌ ఇండియా సినిమాలు సందడి చేస్తున్న ఈ సమయంలో ఇలాంటి మూవీని ప్రేక్షకులు ఆదరించడం కాస్త కష్టమే.

టైటిల్‌ : కణ్మనీ రాంబో ఖతీజా
నటీనటులు : విజయ్ సేతుపతి, నయనతార, సమంత, ప్రభు, శ్రీషాంత్‌ తదితరులు
దర్శకత్వం:  విగ్నేశ్‌
నిర్మాత:విగ్నేశ్‌ శివన్ – నయనతార – ఎస్.ఎస్.లలిత్ కుమార్
నిర్మాణ సంస్థ: రౌడీ పిక్చర్స్ – సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
సంగీతం : అనిరుథ్‌

హైలైట్స్‌‌: నటీనటులు
డ్రాబ్యాక్స్‌: సాగదీతగా అపినించే కొన్ని సన్నివేశాలు

చివరిగా: కణ్మణి రాంబో ఖతీజా.. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu