మహేష్ బాబుతో కీర్తి సురేష్ రొమాన్స్!

కీర్తి సురేష్ తెలుగులో ‘నేను శైలజ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ తరువాత వరుస తమిళ ప్రాజెక్ట్స్ తో బిజీ అయిన ఈ భామ ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి సిద్ధ పడుతోంది. ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతోన్న ‘నేను లోకల్’ సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రానున్న సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరుపుకొంది. డిసంబర్ ఆఖరి వారం లేదా.. జనవరి నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తరువాత మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.