పవన్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసింది!

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు కీర్తి సురేష్. తెలుగులో నేను శైలజ సినిమా చేసిన ఈ భామ కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి దాదాపు అగ్ర హీరోలందరి సినిమాల్లో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. తెలుగులో నాని సరసన ‘నేను లోకల్’ సినిమాలో నటిస్తోంది.

తాజాగా మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో అవకాశం దక్కించుకొని అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇప్పుడేమో ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాకు ఓకే చెప్పి మరోసారి వార్తలో నిలిచింది. నిజానికి ఈ భామ పవన్ తో ఇదివరకే సినిమా చేయాల్సింది కానీ డేట్స్ కేటాయించలేక చేయలేకపోయింది.

ఇప్పుడు పవన్ కల్యాణ్, తమిళ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించమని సంప్రదించగా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. వరుసగా మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. టాలీవుడ్ లో కూడా అగ్రతారగా వెలుగొందబోతోంది ఈ బ్యూటీ.