HomeTelugu Trendingదర్శకుడిని చితకొట్టిన కీర్తి సురేష్‌

దర్శకుడిని చితకొట్టిన కీర్తి సురేష్‌

Keerthi Suresh revenge on Rకీర్తి సురేష్‌ నితిన్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అబుదాబీలో జరుగుతోంది. అయితే ఈమూవీ షూటింగ్ లో భాగంగా కీర్తి లోకేషన్‌లో నిద్రపోతున్నప్పుడు హీరో నితిన్, దర్శకుడు వెంకీ అట్లూరి ఇద్దరూ కలిసి ఆమె పడుకున్నప్పుడు ఆమె వెనుక చేరి ఒక సెల్ఫీ తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఇంత ఎండలో తమకు చెమటలు పడుతుంటే ఈమె మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతుంది అంటూ నితిన్ కామెంట్ చేశాడు.

ఈ క్రమంలో ఈ ఫోటో ను తాను కూడా తమ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కీర్తి ఒక గుణపాఠం నేర్చుకున్న అదేంటంటే సినిమా సెట్స్ లో ఇంకెప్పుడూ నిద్రపో కూడదని అంటూ చెప్పుకొచ్చింది. త్వరలోనే మీ మీద పగ తీర్చుకుంటానని కామెంట్ చేసిన కీర్తి సురేష్‌ నిజంగానే డైరెక్టర్‌ని చితకొట్టింది. అయితే అదంతా సరదాగాకే. ఇక నితిన్ ఒక్కడు మాత్రం బాకీ ఉన్నాడని రాసుకుంది కీర్తి. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu