కీర్తి సురేష్‌కు ఫ్లాటైపోయిన నితిన్‌.. మరోసారి ఆమెకే ఓటు


కీర్తి సురేష్‌ ప్రస్తుతం తెలుగులో నితిన్‌ హీరోగా నటిస్తున్న’రంగ్ దే’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది.

ఈ సినిమాలో కీర్తి సురేష్‌ తన పాత్రలో ఇమిడిపోయిందిట. ఆమె నటన.. నటన పట్ల ఆమెకి గల అంకితభావాన్ని చూసిన నితిన్, మరో సినిమాలోనూ హీరోయిన్‌గా ఆమెనే తీసుకున్నాడని తెలుస్తోంది. ‘రంగ్ దే’ తరువాత నితిన్ మూడు సినిమాలు చేయనున్నాడు. మూడవ సినిమాగా ఆయన ‘పవర్ పేట’ చేయనున్నాడు. ఈ సినిమాకి కృష్ణచైతన్య దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ కి ఛాన్స్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా నిర్మితం కానున్నట్టుగా తెలుస్తోంది. ఇటు ‘రంగ్ దే’ చిత్రంలో .. అటు ‘పవర్ పేట’ మూవీలో నితిన్ సరసన నాయికగా కీర్తి సురేష్‌ ఏ స్థాయిలో మార్కులు కొట్టేస్తుందో చూడాలి.