HomeTelugu Trending'బిగ్‌బాస్'ను బ్యాన్‌ చేయాలి

‘బిగ్‌బాస్’ను బ్యాన్‌ చేయాలి

9 28‘బిగ్‌బాస్-3’ షో నిర్వహించడం చట్ట విరుద్ధమని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రసారాలు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ షోను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటువం‍టి కార్యక్రమాల ద్వారా యువత చెడు మార్గంలోకి వెళ్తున్నారని, దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కూడా ధర్నా చేసినట్టు చెప్పారు. బిగ్‌బాస్‌ షోను నిషేధించే వరకు దేశవ్యాప్తంగా నిరసలు చేపడతామని హెచ్చరించారు.

అన్నమయ్య, షిరిడిసాయి లాంటి భక్తిరస సినిమాల్లో నటించిన నాగార్జున ఇలాంటి షో చేయడం ఎంత వరకు సమంజసమని కేతిరెడ్డి ప్రశ్నించారు. సినిమాలను ఎలాగైతే సెన్సార్ చేస్తారో.. అదేవిధంగా బిగ్‌బాస్‌ షోను కూడా సెన్సార్‌ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బ్రాడ్‌కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా బిగ్‌బాస్ షో ప్రసారమవుతోందని ఆయన ఆరోపించారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!