HomeTelugu Big Storiesబర్త్‌డే స్పెషల్‌ ‘అధీరా’ న్యూ పోస్టర్‌

బర్త్‌డే స్పెషల్‌ ‘అధీరా’ న్యూ పోస్టర్‌

Kgf 2 team release special
బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్ నేడు (జూలై 29) తన 62వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్-2’ నుండి మూవీ యూనిట్ ఓ ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో సంజయ్ దత్ ఓ పెద్ద ఖడ్గం పట్టుకొని నిలుచొని ఉన్నారు. చూస్తుంటే ఇది ఓ భారీ ఫైట్ సీన్‌లో సన్నివేశంలా తెలుస్తోంది. ‘యుద్ధం అంటే అందులో పురోగతి ఉండాలి.. నేను చెప్పేదాన్ని రాబందులు కూడా ఒప్పుకుంటాయి’ అని అధీరా చెబుతారు అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ విలన్‌గా అధీరా పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబులే ఫిలిమ్స్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, రవీనా టండన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu