HomeTelugu Trendingరవితేజ విడుదల చేయనున్న 'పెళ్లి సందD' లిరికల్ సాంగ్

రవితేజ విడుదల చేయనున్న ‘పెళ్లి సందD’ లిరికల్ సాంగ్

Pelli sandad update

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెళ్లి సందD’ . ఈ సినిమాలో గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్కే అసోసియేట్ .. ఆర్కా మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. రాఘవేంద్రరావు ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నారు.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన ప్రతి అప్ డేట్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. రేపు ఈ సినిమా నుంచి ‘మధురానగరిలో’ అనే మరో లిరికల్ వీడియో సాంగు రానుంది. రవితేజ చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు ఈ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయించనున్నారు. కన్నడ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా పరిచయం కానుంది. శ్రీకాంత్ కెరియర్ ను మలుపు తిప్పిన ఈ టైటిల్ రోషన్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu