HomeTelugu Trendingమన్మథుడు విలన్‌గా సుదీప్‌.!

మన్మథుడు విలన్‌గా సుదీప్‌.!

7 18
కన్నడ నటుడు సుదీప్‌ దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఈగ’ సినిమాతో విలన్‌గా మెప్పించిన ఆయన తాజాగా ‘దబంగ్ 3’ సినిమాలో విలన్‌గా కనిపించి ప్రేక్షకలను అలరించారు. ఇదిలా ఉండగా ఆయన మరోసారి విలన్‌ పాత్రలో మెప్పించనున్నారు. తాజా సమాచారం ప్రకారం యువ హీరో శింబు హీరోగా తెరకెక్కనున్న కోలీవుడ్‌ చిత్రం ‘మన్మథుడు’. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్‌ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట. దీంతో ఈ పాత్ర కోసం ఇప్పటికే చిత్రబృందం అరవింద స్వామిని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదు. తాజాగా ‘మన్మథుడు’ చిత్రంలో విలన్‌ పాత్ర కోసం చిత్రబృందం సుదీప్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. సుదీప్‌ ఈ పాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరోవైపు అయ్యప్ప మాల ధరించిన శింబు ఇటీవల శబరిమల చేరుకుని స్వామివారికి ఇరుముడి సమర్పించారు. ప్రస్తుతం ఆయన ‘మన్మథుడు’ సినిమాలోని పాత్ర కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా కల్యాణి ప్రియదర్శిన్‌ నటించనున్నారు. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించనున్నారు. సురేష్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. యవన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu