
Kingston movie review:
జీవీ ప్రకాశ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన “కింగ్‌స్టన్” సినిమా ఈరోజు థియేటర్స్‌లో విడుదలైంది. భారతదేశం నుంచి వచ్చిన మొట్టమొదటి సముద్ర యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రచారం పొందిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? తెలుసుకోవడానికి రివ్యూ చదవండి.
కథ:
1982లో తమిళనాడులోని తూవతూర్ అనే తీరప్రాంత గ్రామం ఒక శాపం వల్ల దిగ్బంధంలో పడిపోతుంది. ఆ కారణంగా గ్రామస్తులు చేపల వేటను మానేస్తారు. ప్రస్తుతకాలంలో కింగ్‌స్టన్ అలియాస్ కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) ఒక అక్రమ వ్యాపార ముఠా కోసం పని చేస్తుంటాడు. కానీ అక్కడి కొన్ని మిస్టరీలు బయటపెట్టిన తర్వాత, తన గ్రామాన్ని తిరిగి పాత వైభవానికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. అయితే సముద్రపు శాపం అతడిని అడ్డుకుంటుంది. కింగ్‌స్టన్ ఆ శాపాన్ని గెలుస్తాడా? లేక అతడూ దాని బలి అవుతాడా? అనేదే కథ.
నటీనటులు:
జీవీ ప్రకాశ్ కుమార్ నటన పరంగా ఓకే అనిపించాడు. ప్రధాన పాత్రను బాగానే భుజాలపై మోశాడు. అతడి హావభావాలు, యాక్షన్ సీన్లలో కాస్త నమ్మకం కలిగించాయి. కానీ కథలో బలహీనతల వల్ల అతని క్యారెక్టర్ మజాను కోల్పోయింది. హీరోయిన్ దివ్య భారతి పాత్ర పెద్దగా ప్రభావం చూపించలేదు. విలన్ పాత్రలు కూడా సరైన ఎఫెక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి.
సాంకేతిక అంశాలు:
దర్శకత్వం: కమల్ ప్రకాశ్ సముద్ర యాక్షన్ థ్రిల్లర్ అనే కొత్త కాన్సెప్ట్ ఎంచుకున్నా, కథను చక్కగా నడిపించలేకపోయాడు.
సంగీతం: జీవీ ప్రకాశ్ సంగీతం సాధారణంగానే ఉంది. ఆసక్తికరమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేదు.
సినిమాటోగ్రఫీ: సముద్రపు సన్నివేశాలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ బాగా మిస్ అయ్యాయి.
ఎడిటింగ్: అనవసరమైన ఫ్లాష్‌బ్యాక్స్, నెమ్మదిగా సాగిన కథ కారణంగా సినిమా బోరింగ్‌గా అనిపించింది.
ప్లస్ పాయింట్స్:
*సముద్ర యాక్షన్ సీన్లు కొంత ఆసక్తిగా ఉన్నాయి.
*జీవీ ప్రకాశ్ నటన ఓకే.
*సెకండ్ హాఫ్‌లో కొంత థ్రిల్ ఉంది.
మైనస్ పాయింట్స్:
-స్లో నేరేషన్, బలహీనమైన కథ.
-అధికంగా ఫ్లాష్‌బ్యాక్స్‌లు, కథకు నష్టం.
-విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా తక్కువ స్థాయిలో ఉన్నాయి.
-ప్రేక్షకుల్ని పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయింది.
తీర్పు:
“కింగ్‌స్టన్” ఒక కొత్త కాన్సెప్ట్‌తో రాగా, కధన పరంగా డీలవడంతో ప్రేక్షకులను కట్టిపడేయలేకపోయింది. సముద్ర యాక్షన్ డ్రామాగా మంచి స్థాయిలో రూపొందించాల్సిన సినిమాకు సరిగ్గా స్క్రీన్‌ప్లే లేకపోవడం వల్ల ఆసక్తి లేకుండా పోయింది. జీవీ ప్రకాశ్ ప్రయత్నం చేసినా, ఈ సినిమా ఊహించినంత అంచనాలు అందుకోలేదు.
రేటింగ్: ⭐⭐½ (2.5/5)