HomeTelugu Trendingరేపు కిరణ్‌ అబ్బవరం కొత్త సినిమా ప్రారంభం

రేపు కిరణ్‌ అబ్బవరం కొత్త సినిమా ప్రారంభం

Kiran Abbavaram New Movie a

కిరణ్‌ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటించిన ‘ఎస్. ఆర్. కళ్యాణ్‌ మండపం’ గత ఏడాది ఆగస్ట్ లో విడుదలైంది మంచి హిట్‌ని అందుకుంది. రెండో సినిమా విడుదలకు ముందే కిరణ్ ‘సమ్మతమే, సబాస్టియన్’ సినిమాలను అంగీకరించాడు. అవి సెట్స్ మీద ఉండగానే ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె నిర్మించే తొలి చిత్రంలో ఆఫర్ అందుకున్నాడు. అలానే నవంబర్ మాసంలో కిరణ్ అబ్బవరం హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఓ సినిమాను ప్రారంభించింది.

తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కిరణ్ అబ్బవరం ఓ మూవీ చేయబోతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 ప్రొడక్షన్ నంబర్ 7గా నిర్మితం కాబోతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి 7వ తేదీ ఉదయం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో మొదలు కాబోతోంది. ఇది కిరణ్‌ అబ్బవరం కూ 7వ చిత్రం కావడం విశేషం. సినిమా పేరుతో సహా పూర్తి వివరాలను రేపు ప్రకటించనున్నారు.

Kiran Abbavaram New Movie Update

Recent Articles English

Gallery

Recent Articles Telugu