పరుగు దర్శకుడితో అఖిల్ సినిమా.!

అక్కినేని యంగ్‌ హీరో మొదటి మూడు సినిమాలు నిరాశ పరిచాయి. మిస్టర్ మజ్ను సినిమా మంచి హిట్ అవుతుందని అందరు అనుకున్నా.. దానికి భిన్నంగా ఫలితం రావడంతో అఖిల్ ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అఖిల్ తరువాత చిత్రం ఎవరితో ఉండబోతోందనే ఆస్తకి కూడా పెరిగింది. దీనికి తగ్గట్టుగానే అఖిల్ నెక్స్ట్ సినిమా టాలీవుడ్ టాప్ బ్యానర్లో ఉండబోతున్నట్టు సమాచారం.

గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో అఖిల్ సినిమా చేయబోతున్నాడు. బన్నీ వాసు ఈ సినిమాకు నిర్మాత. బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ లో అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న భాస్కర్.. ఆ తరువాత పరుగు సినిమాతో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. ఇప్పుడు ఎలాగైనా మంచి హిట్ తో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నాడు. అఖిల్ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన కథ చర్చలు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. అన్ని కుదిరితే.. సినిమా పట్టాలెక్కడం ఖాయం. ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది అన్నది త్వరలోనే తెలుస్తుంది.