విజయ్ దేవరకొండకు లక్కీ ఛాన్స్!

గీతాఆర్ట్స్ కి అనుభంద సంస్థ గా జిఏ2 బ్యాన‌ర్ లో భ‌లేభ‌లేమ‌గాడివోయ్ లాంటి చిత్రం త‌రువాత నిర్మాత బ‌న్నివాసు మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించబోతున్నారు. ఈ సందర్భంగా..
నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ.. ”శ్రీ అల్లు అర‌వింద్ గారు నిర్మాత గా 2016 లో నిర్మించిన మూడు చిత్రాలు సూప‌ర్‌హిట్స్ కావ‌టం చాలా హ్య‌పిగా వుంది. ‘శ్రీరస్తు శుభ‌మ‌స్తు’ చిత్ర ద‌ర్శ‌కుడు ప‌రుశురాం గారు చాలా మంచి క‌థ చేప్పారు. ఈ క‌థ విన్న‌వెంట‌నే అర‌వింద్ గారికి చాలా న‌చ్చింది. వెంట‌నే నాకు వినిపించారు. సింగిల్ సిట్టింగ్ లోనే ఈ చిత్ర క‌థ మాకు న‌చ్చింది. ఆల్‌రెడి మా బ్యాన‌ర్ లో మంచి స‌క్స‌స్ ని ఇచ్చిన ద‌ర్శ‌కుడు కావ‌టంతో ఏమాత్రం ఆలోచించ‌కుండా ఓకే అనేశాము. ప‌రుశురాం గారి క‌థ కంటే విజ‌న్ సూప‌ర్ వుంటుంది. భ‌లేభ‌లేమ‌గాడివోయ్ లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ త‌రువాత జిఏ2 బ్యాన‌ర్ లో గ్యాప్ తీసుకున్నాము. ఆ రేంజ్ విజ‌యాన్ని సాధించే చిత్రాలు చేయ్యాలనే ధృఢ‌సంక‌ల్పంతో గ్యాప్ తీసుకున్నాము. అల్లు అర‌వింద్ గారు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం అతి త్వ‌ర‌లో సూప‌ర్ టెక్నిషియ‌న్స్ తో భారీ తారాగాణం తో సెట్స్ మీద‌కి వెళ్ళ‌నుంది” అని అన్నారు.