
మెగాస్టార్ చిరంజీవి ఏకైక తనయుడు రామ్ చరణ్ ఇటీవలే తండ్రైన సంగతి తెలిసిందే. ఆయనకు పండంటి కుమార్తె జన్మించింది. ఆ పాపకు క్లింకారా అనే నామకరణం కూడా చేశారు. ఈ రోజు చిరు పుట్టిన రోజు సందర్భంగా క్లింకారాను చిరు ఎత్తుకున్న ఫోటోని రామ్ చరణ్ షేర్ చేశారు. ఆ ఫొటోలో క్లింకారా ముఖం కనపడకుండా కవర్ చేశారు అయితే, రామ్ చరణ్ పెట్టిన కామెంట్ హైలైట్ గా మారింది. చిరంజీవిని క్యాప్షన్ లో చరణ్ చిరుత గా మార్చేశారు.
చిరుత అంటే చిరు తాతా అని అర్థమట. తమ కుటుంబంలోని చిన్నదైన తమ కుమార్తె తరుపున తన తండ్రికి చరణ్ పుట్టిన రోజు విషెస్ తెలియజేయడం విశేషం. కాగా, చరణ్ మొదటి సినిమా చిరుత నే కావడం విశేషం. దానిని, తన తండ్రికి పెట్టడం ఇప్పుడు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక, మొన్నటి వరకు సెలవులో ఉన్న రామ్ చరణ్ ఇటీవల గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకి శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కియార అద్వాణీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీని తర్వాత చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. చిరంజీవి విషయానికి వస్తే, ఇటీవల భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందకు వచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఈ రోజు మరో రెండు సినిమాలు ప్రకటించారు. అవి, త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది.













