HomeTelugu Trendingకొబ్బరిమట్ట 'మీకు నచ్చుతుందని డ్యాన్స్‌ ట్రై చేశాను'.. వీడియో

కొబ్బరిమట్ట ‘మీకు నచ్చుతుందని డ్యాన్స్‌ ట్రై చేశాను’.. వీడియో

1 15నటుడు సంపూర్ణేష్‌ బాబు వినోదాత్మక కథలు, నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాడు.. అయితే ఈసారి డ్యాన్స్‌తోనూ అలరించే ప్రయత్నం చేశాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. రూపక్‌ రొనాల్డ్‌ సన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్టీవెన్‌ శంకర్‌ కథ అందించారు. ఈ సినిమాలోని ‘అ.ఆ..’ అని సాగే పాట టీజర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో సంపూ తన స్టెప్పులతో అదరగొట్టారు. ఈ టీజర్‌ను సంపూ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘మీకు నచ్చుతుందని డ్యాన్స్‌ ట్రై చేశాను’ అని పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోకు నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ‘సంపూ ఇరగదీశావు.. సూపర్‌ హిట్ బొమ్మ, మైఖెల్‌ జాక్సన్‌ మళ్లీ పుట్టాడు, అన్నా డ్యాన్స్‌తో చంపేశావ్‌..’ అంటూ తెగ కామెంట్లు చేశారు. వీటిని సంపూ రీట్వీట్‌ చేశారు. ‘కొబ్బరి మట్ట’ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఈ చిత్రాన్ని ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu