‘ఓల్డ్ మాంక్’ నుండి ‘గిచ్చి గిలి గిలి’ సాంగ్‌ విడుదల

Gicchi Gili Gili from Old Monk is a fun track

కన్నడ లో సూపర్‌ హిట్‌ అయిన ‘ఓల్డ్ మాంక్’ సినిమాని తెలుగులో అదే పేరుతో శ్రీనివాస్ దర్శకత్వంలో రూపోందిస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ హక్కులను ఆర్కే నల్లం మరియు రవి కశ్యప్ కొనుగోలు చేశారు.

తాజాగా ఈ సినిమా నుండి ‘గిచ్చి గిలి గిలి’ పాట విడుదలైంది. ఈ పాటను సౌరవ్ మరియు వైభవ్ స్వరపరిచారు. ధనుంజయ్ సీపన ఆలపించారు. ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ జరుగుతోంది. ఈ చిత్రం క్లాప్‌బోర్డ్ ప్రొడక్షన్స్ మరియు స్టార్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్‌తో కలిసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రంలో అదితి ప్రభుదేవా, సుదేవ్ నాయర్, ఎస్ నారాయణ్, సిహి కహి చంద్రు తదితరులు నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ ప్రకటించనున్నారు మేకర్స్‌.

CLICK HERE!! For the aha Latest Updates