HomeTelugu Trending'కొబ్బరిమట్ట' ఈవీవీకి అంకితం

‘కొబ్బరిమట్ట’ ఈవీవీకి అంకితం

6 3నవతరం హాస్యానికి పట్టం కట్టిన దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని అంకితం చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యం చేసిన చిత్రం ఇది. రూప‌క్ రొనాల్డ్ స‌న్ దర్శకుడు. స్టీవెన్ శంక‌ర్ కథ, కథనం అందించారు. సాయి రాజేష్ నిర్మాత‌. ఈ చిత్రం ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. ఆగస్టు 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రం నైజాం, విదేశీ హ‌క్కుల్ని నోబారియ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సొంతం చేసుకుంది. 120 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో యాక్షన్‌‌, కామెడీ, సెంటిమెంట్‌, రొమాన్స్‌, సందేశం, ఎమోష‌న్‌, ల‌వ్ లాంటి అన్ని జోనర్స్ ఉన్నట్లు నిర్మాత సంస్థ అమృత ప్రొడక్షన్స్‌ తెలిపారు. ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు ఈవీవీకి అంకితం ఇస్తున్నట్లు తెలియజేశారు.

‘కొత్త తరం హాస్యానికి ఆద్యులు మీరు. కొత్త తరం దర్శకులకి విలువ తెచ్చిన మహనీయులు మీరు. మీరు లేనిలోటు.. మీ చిత్రాలు తీరుస్తూనే ఉన్నాయి. మీరు లేరన్న విషయం గుర్తు చేస్తూనే ఉన్నాయి. మీ మార్క్ హాస్యం కోసం ప్రయత్నిస్తూ ఈ చిత్రం అంకితం ఇస్తున్నాం’ అని సంస్థ ప్రకటన విడుదల చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu