#మీ-టు పై ప్రణీత, నిధి అగర్వాల్ స్పందన!

#మీ-టు ఉద్యమంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా హీరోయిన్లు ప్రణీత, నిధి అగర్వాల్ కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. మీ-టుపై తను స్పందించనని ప్రణీత అంటుంటే.. ఫుల్ సపోర్ట్ ఇస్తానంటోంది నిధి అగర్వాల్. “కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి చోట ఉంది. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్న ఇతర హీరోయిన్లు, ఫిమేల్ ఆర్టిస్టులపై కూడా నేను స్పందించలేను. ఎందుకంటే నాకు అలాంటి అనుభవాలు లేవు. వాళ్ల పెయిన్ నేను అర్థం చేసుకోలేను. కావాలని కొందరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. వాటిపై కూడా నేను స్పందించలేను. “ఇలా కాస్టింగ్ కౌచ్ పై ఏమీ చెప్పకుండా తప్పించుకుంది ప్రణీత. కానీ నిధి అగర్వాల్ మాత్రం ఊరుకోలేదు. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతున్న ఈ బ్యూటీ.. మీ-టూకు పూర్తి మద్దతు ప్రకటించింది.

“మీ-టు ఉద్యమానికి నేను పూర్తి మద్దతు ఇస్తాను. అయితే మీ-టు ప్రస్తుతం పక్కదారి పడుతోంది. కేవలం మహిళల వేధింపులపైనే మాట్లాడాలి. ఇంకేదో కొత్త కోణాలు తీస్తున్నారు. అలా చేయొద్దు దయచేసి. సెట్స్ లో ఆడ-మగ మధ్య రకరకాల సంబంధాలుంటాయి. కొందరికి కొన్ని కొన్ని రిలేషన్ షిప్స్ ఉంటాయి. అన్నింటినీ మీ-టు కిందకు తీసుకురాకూడదు.” ఇలా మీ-టుపై తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా బయటపెట్టింది నిధి అగర్వాల్‌. అయితే మీ-టూ లో కేవలం మహిళా వేధింపుల గురించే మాట్లాడుతున్నారని, పురుషులు కూడా వేధింపులకు గురవుతున్నారని అంటోంది.

“మీ-టు అనేది కేవలం మహిళలకు సంబంధించినది మాత్రమే కాదు. చాలామంది మగవాళ్లు కూడా వేధింపులకు గురవుతున్నారు. వాళ్లకు కూడా న్యాయం జరగాలి. ఇక నా విషయానికొస్తే, నన్ను ఎవరూ వేధించలేదు. అలాంటి పాడు ప్రపోజల్స్ కూడా తీసుకురాలేదు. పైగా నాకు బాక్సింగ్ వచ్చు. రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తాను. మార్షన్ ఆర్ట్స్ లో కూడా ప్రవేశం ఉంది. దీనికి తోడు నాకు ఏదైనా జరిగితే వెంటనే దాన్ని ఇనస్టాగ్రామ్ లో పెడతాను.” కాస్టింగ్ కౌచ్ పై ఇలా తమ స్టైల్‌ లో స్పందించారు ఈ ఇద్దరు హీరోయిన్‌లు. అయితే కెరీర్ లో తమకు ఎప్పుడూ అలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వలేదని అంటున్నారు ప్రణీత, నిధి.