కోన వలకు పవన్ చిక్కుతాడా!

రచయితగా, నిర్మాతగా సుపరిచితులైన కోన వెంకట్ ఇప్పుడు దర్శకుడిగా మారాలనుకుంటున్నాడు.
అది కూడా పవన్ కల్యాణ్ హీరోగా నటించే సినిమాతో.. మరి ఇది సాధ్యమవుతుందా..? అసలు
విషయంలోకి వస్తే పవన్ కల్యాణ్ ను డైరెక్ట్ చేయాలనుందని, ఆయనంటే విపరీతమైన అభిమానమని
కోన చాలా సంధార్భాల్లో చెప్పారు. అయితే పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లిపోతే ఆయనతో
సినిమా చేయడం కుదరదని కోన ఇప్పటినుండే తన ప్రయత్నాలు షురూ చేశారు. పవన్
తో ఆయనకున్న పరిచయంతో సినిమా చేయడానికి ఒప్పిచాలని ప్రయత్నిస్తున్నట్లు టాక్.
పవన్ అతి త్వరలో దాసరి నారాయణరావు బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నారు. అయితే ఈ
సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టేది ఎవరనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. దీంతో
కోన, దాసరిని కలిసి కథలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. దాసరి ఎన్ని కథలు విన్నప్పటికీ
ఫైనల్ డెసిషన్ పవన్ కే వదిలేస్తారట. మరి పవన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో.. చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here