కోపంతో వెళ్ళిపోయిన ప్రకాష్ రాజ్!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కోపంతో ఇంటర్వ్యూ మధ్యలో నుండే వెళ్ళిపోయారు. అసలు విషయంలోకి
వస్తే ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న ‘మన ఊరి రామాయణం’ సినిమా విడుదలకు సిద్ధంగా
ఉంది. ఈ సినిమాలో ఆయనొక ప్రధాన పాత్రలో నటించాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా
ప్రకాష్ రాజ్ ఓ కన్నడ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ కోసం వెళ్లారు. అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నకు
కోపంతో రగిలిపోయారు. ఇక వెంటనే ఇంటర్వ్యూ మధ్యలోనుండి లేచి వెళ్ళిపోయారు. ఇప్పుడు
ఇదే హాట్ టాపిక్ గా మారింది. కావేరీ నీళ్ళ విషయంలో మీ స్టాండ్ ఎంత ఉందని యాంకర్ అడగగా..
ప్రకాష్ రాజ్ ఆగ్రహానికి గురయ్యారు. అసలు సినిమాకు, దీనికి సంబంధం ఏంటని..? అక్కడ
నుండి వెంటనే వెళ్ళిపోయారు. అంతేకాదు ఇకపై తన ఇంటర్వ్యూ కోసం రావద్దంటూ.. వార్నింగ్
కూడా ఇచ్చారు. ప్రకాష్ రాజ్ అప్పుడప్పుడు సెట్స్ లోనే కోపాన్ని ప్రదర్శిస్తారనుకుంటే.. ఇప్పుడు
ఏకంగా మీడియాపై కూడా చూపిస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates